మోహన్ బాబు...డైరక్షన్ వైపు ఎందుకు వెళ్లలేదో తెలుసా

updated: February 19, 2018 22:48 IST
మోహన్ బాబు...డైరక్షన్ వైపు ఎందుకు వెళ్లలేదో తెలుసా

విల‌క్ష‌ణ న‌టుడు గా పేరు తెచ్చుకున్న మంచు మోహ‌న్ బాబు .  త‌గిన పాత్ర ప‌డాలే గానీ చెల‌రేగిపోతారనటంలో సందేహం లేదు. అయితే గ‌త కొంత‌కాలంగా ఆయ‌నతన నటనా  ప్ర‌యాణం ఆచితూచి సాగిస్తున్నారు. వరసపెట్టి పెద్ద‌గా సినిమాలు చేయ‌డం లేదు . అయితే ఈ మధ్యనే రీసెంట్ ఓ కథ నచ్చి....  'గాయ‌త్రి' అనే సినిమా చేసారు. ఇందులో మోహ‌న్ బాబు చేసిన ద్విపాత్రాభిన‌యం హాట్ టాపిక్ అయ్యింది. 

ముఖ్యంగా గాయిత్రి పటేల్ గా ఆయన చేసిన నటన...నభూతో న భవిష్యతి అన్నట్లుగా సాగింది. సినిమా చూసిన అందరూ ముక్త కంఠంతో అన్నమాట ఒకటే.. మోహన్ బాబు తప్ప మరెవ్వరూ చేయలేరు.  ఇక అటువంటి సీనియర్ నటుడు..సినిమాలోని  24 శాఖలతోనూ పూర్తి స్దాయి పట్టు ఉన్న వ్యక్తి, సమర్దుడు దర్శకుడుగా ఎందుకు సినిమాలు చేయటం లేదు అనే సందేహం వస్తుంది. అదే తాజాగా ఓ మీడియా హౌస్ వారు ఆయన ముందు ఉంచారు.  దానికి ఆయన ఏం సమాధానం ఇచ్చారో చూద్దాం..

మోహన్ బాబు మాట్లాడుతూ.. దర్శకుడుగా చాలా కష్టం ...నా కు  పెద్ద వీక్నెస్... భయంకరమైన వీక్నెస్..సెట్ కు వచ్చావ్..పోన్ మాట్లాడకూడదు..సెట్ కొచ్చావ్..ఏం సీన్ తీయాలి.. ఏ డైలాగు చెప్పించాలి..ఆ మూడ్ లో ఆలోచనలో ఉండాలి దర్శకుడు అనేవాడు.. సెట్ లో పేకాట ఆడటం...జరుగుతూంటుంది. అది దర్శకుడుదే తప్పు. ముడ్డిమీదతన్నాలి .. అంటూ ముక్కుసూటిగా చెప్పారు. ఇలాంటి ఎన్నో విషయాలు ఆయన ఈ ఇంటర్వూలో పాలుపంచుకున్నారు. మీరు ఈ వీడియోలో చూడచ్చు.

Disclaimer: The following shared video may not be part of Telugu100.com network. Sometimes we may give external links to strengthen the quality of the posts. In this case, Telugu100.com is not responsible for the content of the videos and the original owner would be responsible for the same.

comments